వివక్ష గండాన్ని దాటి
పుట్టడమనే పరీక్షలోనెగ్గి
బతుకుని దారంచేసి
గుండెచెంగులో
ప్రేమ పరిమళాన్ని ముడేసి
కుటుంబసేవలో నిత్యావధానియై
వేధింపుల ముళ్ళమధ్య
ఆత్మస్థైర్యమే అరుణోదయమై
హిమనగాలు ఎక్కి
సముద్రాలు ఈది
అవనిలోనేకాదు ఆకాశంలో సగమై
లోకాన్ని చూపించే కనుపాపై
పసికందైనప్పుడే
త్యాగానికి అర్థంచెప్పి
జీవించడం నేర్చుకున్న
మగువజీవితం అర్ధవంతం
అడుగడుగూ పరీక్షయిన
ఆడ బ్రతుకులో
మహిళాసాధికారత
జయకేతనమై
రెపరెపలాడాలని ఆశిద్దాం
మగువ ప్రాధాన్యతనెరిగి
ఆమె కంటనీరు వినాశనం
తన ఆశీస్సులే విజయమని
గుర్తెరిగి
మనసు కలతపడక
ప్రేమ స్వరూపిణిని
ప్రేమించుదాం...గౌరవిద్దాం
ఆడతనాన్ని
మోడు వారనివ్వొద్దు
కడవరకు
కనుపాపలా కాపాడుదాం.
వేమూరి శ్రీనివాస్
99121 28967