Jun 28,2023 21:06

ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్న వేదపండితులు

నందలూరు : అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధ వారం ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహ లగంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపం డితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిషి'ంచారు. అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది. శ్రీ సౌమ్యనాథస్వామి, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మౌత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి సమక్షంలో ధ్వజారోహణం నిర్వ హించారు. ధ్వజారోహణం బ్రహోత్సవాలకు సూచిక. సకల దేవతలకు ఆహ్వానం పలికే ధ్వజా రోహణంలో మహావిష్ణువుకు గరుత్మంతుడు ప్రియ వాహనం. కావున ఆ గరుడ నిలువెత్తు రూపం 20 మీటర్ల నూతన వస్త్రంపై పసుపు, కుంకుమ, తైలంతో చిత్రీకరించారు. దీనినే ధ్వజ పటం అంటారు. ఈ నూతన వస్త్రం ధ్వజస్తంభంపై ఎగరవేస్తే సకల దేవతలు బ్రహ్మోత్సవాలను తిలకి స్తారని ప్రతీతి. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు మధ్య గరుడ ధ్వజపీఠాన్న ధ్వజస్తం బాగ్రహంనకు లాగారు దీంతో ధ్వజారోహణం పూర్త యింది. రాత్రి యాలి వాహనంపై మహా తేజోవంతుడైన శ్రీ సౌమ్యనాధుడు శ్రీదేవి భూదేవితో కలిసి విశేషాలంకరణలో పురవీధుల్లో ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో టిటిడి జెఇఒ సదా భార్గవి, ఎంపిపి మేడా విజయభాస్కర్‌రెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్‌ దిలీప్‌, ఆలయ మాజీ అధ్యక్షులు అరిగెల సౌమిత్రి, సోమిశెట్టి ప్రభాకర్‌, అరిగె నాని, కాకి చంద్ర, పెనుబాల నాగసుబ్బయ్య పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో నేడు
ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం ఉదయం పల్లకిసేవ, గ్రామోత్సవం, తిరుమంజనం. రాత్రికి హంస వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి గ్రామోత్సవం నిర్వహిం చనున్నట్లు డెప్యూటీ ఇఒ నటేష్‌ బాబు తెలిపారు.
రూ.50 లక్షలతో వసతులు : జెఇఒ
బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని జెఇఒ సదా భార్గవి చెప్పారు. మూలవిరాట్‌తోపాటు వాహనసేవలను భక్తులు సంతప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. త్వరలో ఆర్కియాలజి డిపార్టుమెంటు అనుమతులతో మరిన్ని అభివద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.