ప్రజాశక్తి - చిప్పగిరి
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామమైన గుమ్మనూరులో బసవేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన వైసిపి కన్వీనర్ గుమ్మనూరు నారాయణ, సోమవారం సర్పంచి పచ్చర్లపల్లి లక్ష్మీదేవి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. మంత్రి గుమ్మనూరు జయరాం స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి నిరుపేద కుటుంబం సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. గత చంద్రబాబు పరిపాలనలో వర్షాల్లేక కరువు విలయతాండవం చేసిందన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం మన కర్తవ్యమన్నారు. ఎస్‌ఐ మల్లికార్జున ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దేవరగట్టు ఆలయ ఛైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, సొసైటీ ఛైర్మన్ డేగులపాడు మల్లికార్జున, ఏరూరు రంగస్వామి, షేకన్న, సతీష్, బాలకృష్ణ పాల్గొన్నారు.
వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం










