May 04,2023 23:26

దేవస్థానం గార్డెన్లలో సత్యదేవుని వన విహారోత్సవం, గ్రామోత్సవం


ప్రజాశక్తి - అన్నవరం
అన్నవరం సత్యదేవుని వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా ఐద రోజు గురువారం నిర్వహించిన స్వామి, అమ్మవార్ల వనవిహారోత్సవం కన్నుల పండువగా జరిగింది. కొండదిగువన గల దేవస్థానం ఉద్యానవనంలో ఈ నిర్వహించిన కార్యక్రమంలో అక్కడ వివిధ జాతుల పూలమొక్కలతో ప్రత్యేక వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేవస్థానం ఇఒ ఎస్‌.ఆజాద్‌ సమక్షంలో అర్చకులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి ఈ వన విహార వేడుక ముగించారు. అనంతరం రాత్రి 9 గంటలకు వెండిరథంపై స్వామి, అమ్మవార్లకు గ్రామ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు యాత్రికులను అలరించాయి.
సత్యదేవుని కి హుండీల హుండీల ఆదాయం 1.74 కోట్లు
అన్నవరం సత్యదేవునికి హుండీల లెక్కింపు ద్వారా రూ.1,74,78,440 ఆదాయం లభించింది. గురువారం కొండపైన దేవస్థానం ఇఒ ఎస్‌.ఆజాద్‌,. పాలక మండలి సభ్యులు బద్రి సమక్షంలో దేవస్థానం అధికారులు 36 రోజుల్లో వచ్చిన వివిధ హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ లెక్కింపులో నగదు తో పాటు 280 గ్రాముల బంగారం, ఒక కేజీ వెండి ఇంకా వివిధ దేశాలకు చెందిన కరెన్సీ లభించింది. అయితే గత సంవత్సరం ఇవే రోజుల్లో సత్యదేవునికి 1.33 కోట్లు మాత్రమే ఆదాయం రావడంతో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 40 లక్షలు ఆదాయం పెరిగిందని దేవస్థానం అకౌంట్‌ విభాగం అధికారి వై.అప్పారావు తెలిపారు.