May 02,2023 00:12

కళ్యాణవేదికపై స్వామి అమ్మవార్లకు కళ్యాణ జరిపిస్తున్న రుత్వికులు ..... ప్రభుత్వం తరఫున పట్టు వస్తాలు తీసుకుని వస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ...


ప్రజాశక్తి - అన్నవరం
అన్నవరం రత్నగిరిపై వేంచేసియున్న శ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహౌత్సవం సోమవారం రాత్రి 9:30 గంటల నుండి అంగరంగ వైభవంగా జరిగింది. స్మార్త ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించిన ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి యాత్రి కులు తరలిరావడంతో రత్నగిరి జనసందో హమైంది. ఉదయం 8 గంటలకు అంకురార్పణ చేసి ధ్వజారోహణ గావించారు. రాత్రి 7 గంటలకు వధూవరులైన శ్రీసత్యదేవుని వెండి గరుడవాహనం పైన, అనంతలక్ష్మీ అమ్మ వారిని వెండి గజవాహనం పైన, పెండ్లిపెద్దలైన క్షేత్రపాలకులు సీతారాము లను వెండిపల్లకి లోను గ్రామంలో ఊరేగించి కళ్యాణవేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. కళ్యాణానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌లు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించగా, దేవస్థానం ఇఒ చంద్రశేఖర్‌ ఆజాద్‌ దంపతులతో పాటు జిల్లా అధికారులు, పాలకమండలి సభ్యులు కళ్యాణ సామగ్రిని వేదికవద్దకు తీసుకువచ్చారు. రాత్రి గం. 9.30లకు సుగంధభరిత పుష్పాలతో, విద్యుద్దీప కాంతులతో మనోహరంగా అలంకరిం చిన ప్రత్యేక కళ్యాణవేదికపై స్వామి అమ్మ వార్ల కళ్యాణమహౌత్సవానికి శ్రీకారం చుట్టారు.
విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం గావించి పాణిగ్రహసంకల్పం, కన్యావరణ కార్యక్రమాలను నిర్వహించి, సంప్రదాయబద్ధంగా మంగళవాయి ద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణలతో రత్నగిరి ప్రతిధ్వనిస్తుండగా అర్చకులు స్వామి,అమ్మవార్ల శిరస్సులపై ఒకరికొకరు జీలకర్ర, బెల్లం ఉంచి నట్లుగా చేసి సుముహూర్తంలో మంగళ సూత్రధారణ, ముత్యాల తలంబ్రాలు, బ్రహ్మముడి, రక్షాబంధన కార్యక్రమాలను కళ్యాణ్‌ తంతు ప్రక్రియ పూర్తి చేశారు అనంతరం నూతన వధూవరుల పాణిగ్రహణంతో కళ్యాణతంతు వైభవంగా ముగిసింది. తదుపరి స్వామివారి ప్రసాదం, కళ్యాణ తలంబ్రాలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆలయ సిబ్బంది భక్తులకు వితరణ చేశారు. కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు తగిన చర్యలు తీసుకోగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు.
సత్యదేవుని చరిత్ర పుస్తకం ఆవిష్కరణ
అన్నవరం సత్యనారాయణ స్వామి చరిత్రకు సంబంధించి బొమ్మలతో కూడిన పుస్తకాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవి ష్కరించారు. సత్యదేవుని కళ్యాణోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయానికి వచ్చిన మంత్రికి దేవస్థానం ఇఒ ఎస్‌.ఆజాద్‌ ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అనంతరం మంత్రి కొట్టు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శిం చుకున్నారు. ఇఒ మంత్రికి స్వామివారి జ్ఞాపికను ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, ఎసి రమేష్‌ బాబు, పాలక మండల సభ్యులు, పిఆర్‌ఒ కృష్ణారావు పాల్గొన్నారు.