ప్రజాశక్తి - పర్చూరు
బిఎఆర్‌టిఎ జూనియర్ కళాశాల ఆవరణలో పర్చూరు ప్రాంతీయ విద్యాభివృద్ది సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ కృష్ణంశెట్టి కనకయ్య విగ్రహావిష్కరణ ఆదివారం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ఉప్పుటూరి మురళీకృష్ణ, నటులు కారుమూరి శీతారామయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ పర్చూరు ప్రాంత విద్యాభివృద్దికి కనకయ్య మాస్టారు కృషి వెలకట్టలేనిదని అన్నారు. బాలికోన్నత పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. అన్నదానం చేశారు. శీతారామయ్య మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాల వారికి కనకయ్య వెన్నంటి ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కృష్ణంశెట్టి రమేష్‌బాబు, షేక్ అహ్మద్‌బాషా, కోట హరిప్రసాద్, పాబోలు ఉదయభాస్కర్, ప్రిన్సిపాల్ చింపారెడ్డి, డిఎస్‌పి ఉప్పుటూరి రవిచంద్ర, కె రామకోటేశ్వరరావు, కృష్ణంశెట్టి పార్వతి, కొల్లా వెంకటేశ్వర్లు, కనకయ్య కుటుంబ సభ్యులు, జె శ్రీనివాసరావు, కె అజయ్ పాల్గొన్నారు.










