ప్రజాశక్తి - నందవరం
మండలంలోని కనకవీడు పేట గ్రామంలో శ్రీవాల్మీకి మహర్షి నూతన విగ్రహ ప్రతిష్టాపన చేపట్టారు. గురువారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, గణపతి హోమం, మూల మంత్రం, నవగ్రహ పూజ, సర్వదేవత హోమం, పంచామృత అభిషేకంతో వేద పండితులు శ్రీకృష్ణ స్వామి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన చేపట్టారు. ఈ సందర్భంగా వాల్మీకి కమిటీ సభ్యులు మాట్లాడారు. జనం మనదే... బలం మనదే.. ఏకమైతే విజయం మనదే..! అనే సంకల్పంతో కనకవీడు పేట ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలని తెలిపారు. గ్రామంలో వాల్మీకిల ఐక్యంగా ఉండాలని, పిల్లలను బాగా చదివించాలని కోరారు. త్వరలో జరగబోయే ఎస్టీ సాధన కోసం వాల్మీకులందరూ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని తెలిపారు. అనంతరం గ్రామస్తులు, అతిథులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కె.పేట వాల్మీకి కమిటీ సభ్యులు వీరాంజనేయులు, నాగేష్, వీరేష్, మల్లన్న, శాంతప్ప, అంజి, మారెప్ప, డీలర్ ఈరన్న, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నూతనంగా ప్రతిష్టించిన వాల్మీకి విగ్రహం










