
ప్రజాశక్తి - ఆచంట
తాను తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (జీవన సాఫల్య పురస్కారం) అందుకున్నట్లు భీమలాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి ఆర్యవైశ్య మహిళ సేవా మండలి అధ్యక్షురాలు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా విభాగం సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ కొత్త కనకరత్నమాల వెంకటేశ్వర్లు శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం గమిని ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఫౌండ్రీ ప్రెసిడెంట్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, కమిటీ సభ్యులు పొట్టి శ్రీరాములు అద్వోదయ వేదిక సిరిసిరిమువ్వ సోషల్ సర్వీస్ అధ్యక్షులు గమని సుబ్బారావు, గ్రంధి సత్యనారాయణ, పి.శ్రీనివాస్ డాక్టర్ కొండూరి నరసింహారావు, అలివేలు మంగాదేవి, గోపిశెట్టి మనోహర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు తెలిపారు. 1983 నుంచి 2023 వరకూ చేసిన సేవలు స్త్రీ శిశుసంక్షేమాభివృద్ధి, గ్రామాభివృద్ధికి పాటుపడుతూ, సుమారు ఐదువేల మందికి రాష్ట్రస్థాయిలో ఉచిత వృత్తి శిక్షణ ఇచ్చి వారికి కుట్టుమిషన్లు, మగ్గాలు గ్రైండర్లు అందించినందుకు గాను ఈ అవార్డు వచ్చినట్లు తెలిపారు. నాలుగు దశాబ్ధాల పాటు అంతర్జాతీయ స్థాయిలో సుమారు వంద అవార్డులు, పలు సన్మానాలు పొందినట్లు ఆమె వివరించారు. ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్, బిజెబిఎస్ ఉమెన్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇలా సుమారు 15 పదవులు నిర్వహిస్తున్నామని తెలిపారు.