ప్రజాశక్తి-ఆలూరు
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకొనే అధికారమే సమాచార హక్కు. బాధితునికి కావాల్సిన సమాచారాన్ని రాబట్టడం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 2005 అక్టోబర్ 13న దేశమంతా ఈ సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది. ప్రభుత్వ సంస్థల కార్యాలయాల ముందు సమాచార హక్కు చట్టం బోర్డు, అధికారుల వివరాలు పొందుపర్చాలని ఆదేశాలున్నాయి. ఇప్పటికీ కార్యాలయాల ముందు బోర్డు ఉంచకపోవడం అధికారుల అవివేకమా, నిర్లక్ష్యమా అని ప్రజలు పేర్కొంటున్నారు. ఆలూరులోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీరింగ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ కార్యాలయం ముందు సమాచార హక్కు చట్టం బోర్డు కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల కార్యాలయం ముందు సమాచార బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు పేర్కొంటున్నారు.
ఆలూరు విద్యుత్ శాఖ కార్యాలయం










