Aug 16,2022 23:53

ఎంపిడిఒకు వినతిపత్రం ఇస్తున్న ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి, పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి-ఆనందపురం : కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని కోరుతూ ఎంపిడిఒ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి మాట్లాడుతూ, ప్రస్తుతం పెరిగిన ధరలతో పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని, ప్రతి నెలా 7వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, సేఫ్టీ పరికరాలు, మాస్కులు, బ్లౌజులు, షూలు, చెప్పులు, నూనె, సబ్బులు ఇవ్వాలని, గ్రీన్‌ అంబాసిడర్‌ డబ్బులు కార్మికులందరికీ సమానంగా చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్‌చేశారు. అనంతరం ఎంపిడిఒ లవరాజుకు, ఇఒఆర్‌డి ఆంజనేయులుకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు భీమిలి జోన్‌ ఉపాధ్యక్షులు రవ్వ నర్సింగరావు, పారిశుధ్య కార్మికులు సిహెచ్‌ సత్యనారాయణ, పారుపల్లి అప్పలరాజు, కొండ్రు నరసయ్య, కంచుబారికి అప్పారావు, పలికిల అప్పన్న, పొన్న అప్పారావు, ఎరగాని రాము, సాలాపు రాజు, రేల్లి అప్పల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.