ప్రజాశక్తి - ఆరిలోవ : కార్మికులందరికీ కనీస వేతనం నెలకి రూ 26 వేలు చెల్లించాలని, ఈనెల 20న కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్ పిలుపునిచ్చారు. శనివారం జూపార్కు కార్మికులతో మాట్లాడుతూ, ఐదేళ్లకోసారి పెంచాల్సిన వేతన సవరణ జిఒలను గత మూడు పర్యాయాలు ప్రభుత్వాలు దాటేశాయని, దీంతో అరకొర వేతనాలతో కార్మికులు పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై ఈనెల 20న సరస్వతి పార్కు నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శన, కలెక్టరేట్ వద్ద ధర్నాలో భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
గాజువాక :మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని, ఈనెల 20న జరగనున్న మహా ప్రదర్శన జయప్రదం చేయాలని, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి, వెంకటరెడ్డి, జి సుబ్బారావు, సిఐటియు ఉపాధ్యక్షులు ఏం రాంబాబు కార్మికులను కోరారు. జీవీఎంసీ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ జోన్6 మహాసభ శనివారం గాజువాక సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ మహాసభలో భవిష్యత్ కార్యక్రమం తీసుకున్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ, సరస్వతి పార్క్ నుండి కలెక్టరేట్ వరకు జరుగు మహా ప్రదర్శన జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరీటం, లోకేష్, వి వి రమణ పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక అయ్యింది. దీనికే అధ్యక్షులుగా గొల్ల రాము, ప్రధాన కార్యదర్శిగా, గొల్ల గాని అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సోమ దల గణేష్, వర్కింగ్ సెక్రెటరీగా నక్కరాజు, తిన్నారా ట్రెజరర్ గా ఎన్నికయ్యారు.










