ధర్నా చేస్తున్న ఎండిఎం కార్మికులు
ప్రజాశక్తి -భీమునిపట్నం : కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని మండలంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు శనివారం స్థానిక ఎంఇఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సిఐటియు) జోన్ కమిటీ ఆధ్వర్యాన జరిగిన ధర్నానుద్దేశించి యూనియన్ నాయకులు రవ్వ నరసింగరావు మాట్లాడుతూ, వంట గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని, బీమా సదుపాయం కల్పించాలని, యూనిఫాం, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఇఒ కెఎ.బాలామణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఎం కార్మికులు వెంకయ్యమ్మ, ఎర్రమ్మ, రమణమ్మ, సన్యాసమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










