May 02,2023 23:54

కాంతిలాల్‌ దండే జారీ చేసిన ఉత్తర్వులను చూపిస్తున్న నాయకులు.

గిరిజన సంక్షేమ ముఖ్యకార్యదర్శి జారీచేసిన అడ్డగోలు జిఒపై గిరిజన సంఘం ఆందోళన
ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:
ఎపి గిరిజన గురుకులం హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి బాలదేవ్‌, గురుకులం వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పాడి కొండలరావు, బుద్దు, సుంక్ర డిమాండ్‌ చేశారు. మంగళవారం అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, పాడేరు ఐటిడిఎ, పార్వతీపురం మన్యం జిల్లా గురుకులం హాస్టల్లో పనిచేస్తున్న 26 మంది వర్కర్లను సుప్రీం కోర్టు ఉత్తర్వులు మేరకు జారీ చేసిన జిఒ నెం 40 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటి అమలు చేయకపోవడం దారుణమన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే గురుకులంతో సంబంధం లేదని ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమన్నారు. 2021 జనవరిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా, .రాష్ట్ర ప్రభుత్వం నేటీకీ కనీస వేతనాల ఆదేశాలనుఅమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టాలని, లేకుంటే కోర్టు ఉత్తర్వుల ధిక్కారంపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు.