నరసరావుపేట: స్థానిక జె.ఎన్.టి.యు కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు శుక్రవారం తమ సమస్యలు పరిష్క రించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీని వాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఒప్పంద అధ్యా పకుల అసోసియేషన్ అధ్యక్షులు పోట్ల మణికంఠ మాట్లా డుతూ చాలీచాలని జీతాలతో ఆర్థిక పరమైన ఇబ్బందులతో జీవితాలను గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. విశ్వ విద్యాలయాలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు కనీస వేతనాలు చెల్లించాలని ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులు కంటే ఎక్కువ అర్హత వున్నపటికి అతితక్కువ వేతనం వస్తుందన్నారు. యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్కేల్ ప్రకారం కనీస వేతనాలు చెల్లించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై సాను కూలంగా స్పందించిన ఎమ్మెల్యే, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని మణికంఠ తెలిపారు. కార్య క్రమంలో అసో సియేషన్ కార్యదర్శి సిహెచ్.రాకేష్, వి.హరికృష్ణ, ఉపా ధ్యక్షుడు కె. చైతన్య , సాయి ప్రసాద్, సతీష్ పాల్గొన్నారు.










