Jun 11,2023 00:38

పోస్ట్‌ కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న సంఘం నాయకులు

ప్రజాశక్తి -గాజువాక : కనీస పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలని కోరుతూ ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్మెంట్‌ పర్సన్స్‌ ఆధ్వర్యాన పెదగంట్యాడ సిడబ్ల్యుసిలో శనివారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. విశాఖ జిల్లా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు దీనబందు మాట్లాడుతూ, పెన్షనర్లకు కనీస పెన్షన్‌ రూ.9,000 ఇవ్వాలని, దానికనుగుణంగా డిఎ చెలించాలని కోరారు. హయ్యర్‌ పెన్షన్‌ అందరికీ వర్తింప చేయాలని, రైలు ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పోస్టు కార్డులను దేశ ప్రధాని మోడీకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కణితి అప్పలరాజు, కార్యదర్శి పిట్ట గురునాథ్‌, కాకినాడ పెంటారావు, శేసెట్టి అప్పారావు, ఎన్‌వి.రమణ, వెంకటరావు, అప్పలనాయుడు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.