Nov 16,2023 21:47

ప్రజాశక్తి-కాకినాడ కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇపిఎఫ్‌ పెన్షనర్లందరికీ కనీస పెన్షన్‌ రూ.9 వేలు డిఆర్‌తో కలిపి చెల్లించాలని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి సిహెచ్‌.సత్యనారాయణ రాజు డిమాండ్‌ చేశారు. గురువారం బోట్‌ క్లబ్‌ వద్ద ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కర్రి బాబూరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇపిఎఫ్‌ పెన్షనర్లు 75 లక్షల మంది ఉన్నారని అందులో 35 లక్షల మందికి కనీసం రూ.వెయ్యి కూడా చెల్లించడం లేదన్నారు. 2014లో బిజెపి కనీస పెన్షన్‌ రూ.3 వేలు చెల్లిస్తానన్న హామీని ఈ పదేళ్లలో అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఎ.ఖాన్‌, యుఎస్‌ఎన్‌.రెడ్డి మాట్లాడారు. సిపిఎం రూరల్‌ కన్వీనర్‌ తిరుమలశెట్టి నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్ర రావు, బర్నబాస్‌, సత్యనారాయణ, పి.రమణ, దుర్గాప్రసాద్‌, కెవి.సత్యనారాయణ, రామకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, బొట్ట సత్యనారాయణ, బుద్దాల సత్యనారాయణ పాల్గొన్నారు.