ప్రజాశక్తి-మాధవధార : జివిఎంసి 51వ వార్డు పరిధి కళింగనగర్ ఈస్ట్ పార్క్‌లోని వైసిపి వార్డు కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. క్లియర్ ఆఫ్రిక సౌజన్యంతో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించినట్లు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ తెలిపారు. ప్రస్తుతం కంటి సమస్యతో పేద, మధ్యతరగతి కుటుంబీకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటివారికి ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు మాధవి, మేనేజర్లు అజరు, గౌతమ్, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ రవికుమార్, మెట్ట దమయంతి, పైడి ప్రతాప్, శ్యామ్, గణేష్, బాను, ధర్మేంద్ర, చిరంజీవి, వినోద్, రవి, సాధు, పైడిరాజు, చంటి పాల్గొన్నారు.










