Mar 16,2023 23:02

మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ విజయమ్మ

ప్రజాశక్తి బాపట్ల : మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆహారపు అలవాట్లతో ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌. విజయమ్మ తెలిపారు. ప్రపంచ నీటి కాసుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల ఏరియా వైద్యశాలలో నీటి కాసుల వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటిలో నీటి కాసులతో కంటి చూపు క్రమేపి తగ్గిపోయే దశ ఎదురైతే తక్షణమే కంటి వైద్య నిపుణులను సంప్రదించాలన్నారు. నీటి కాసుల నిర్ధారణ పరీక్షలు బాపట్ల ,చీరాల ఏరియా వైద్యశాల్లో ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కంటి సంబంధించిన సమస్యలు వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సప్రందించాలన్నారు. వ్యాధి గ్రస్తులు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వినియోగించుకునే విధంగా ప్రచార కార్యక్రమం నిర్వహించాలని వైద్యాధికారులను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్‌ ఎవి. శేషు రమణ, బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ కె. సిద్ధార్థ, ఆర్‌ఎంఒ కోటేశ్వరరావు, కంటి వైద్య నిపుణులు పి. ఉషా కిరణ్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.