ప్రజాశక్తి-మంగళగిరి : కంటే రంగారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు అన్నారు. సిపిఎం నాయకులు, మాజీ కౌన్సిలర్ కంటే రంగారావు 37వ వర్ధంతి సభ స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహి ంచారు. సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వివి జవహర్లాల్ అధ్యక్ష వహించారు. రాఘవులు మాట్లాడుతూ కంటే రంగారావు మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో పేద ప్రజలు ఎదుర్కొ ంటున్న సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పని చేశారన్నారు. పట్టణంలో అనేక పేదల కాలనీల నిర్మాణంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. భనిర్మాణ కార్మిక సంఘాన్ని నిర్మించి వారి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పని చేశరన్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఉన్న పాలకుల విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని, వీటికి వ్యతిరే కంగా ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయడమే కంటే రంగారావుకు ఘనమైన నివాళి అని చెప్పారు. దేశంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల పేదలు మరింత పేదలుగా మారిపోతు న్నారని, అదే విధానాలను రాష్ట్రంలోని ప్రభుత్వమూ అమలు చేస్తోందని విమర్శి ంచారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యా ప్తంగా బిజెపిని ఓడించాలని పిలుపుని చ్చారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య మాట్లా డుతూ కంటే రంగారావు మంగళగిరి పట్టణంలో అనేక ప్రాంతాల్లో పేదలతో ఇళ్ల్లను వేయించి కాలనీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సభలో సిపిఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్, సీనియర్ నాయకులు పి.బాలకృష్ణ, తాడేపల్లి మండలం కార్యదర్శి డి.వెంకట్‌రెడ్డి, నాయ కులు బి.కోటేశ్వరి, ఎం.బాలాజీ, జానీబాషా, టి.శ్రీనివాసరావు, కంటే రంగారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తొలుత సిపిఎం పతాకాన్ని జెవి రాఘవులు ఆవిష్కరించగా రంగారావు చిత్రపటానికి చెంగయ్య, అమరవీరుల స్తూపానికి వివి జవహర్లాల్ పూలమాలలు వేశారు.










