ప్రజాశక్తి - ఆదోని
విద్యార్థులకు కంప్యూటర్ నేర్పించాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని విజయభాస్కర్ రెడ్డి నగర్‌లో ఉన్న కస్తూరీబా గాంధీ ఒకేషనల్ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులను, పరిసరాలను, ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ నేర్చుకున్న వారికి మంచి అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు కంప్యూటర్ తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ... సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను, ప్రహరీ పనులను పూర్తి చేయాలని ఎంఇఒ శివ రాముడును ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా, నాణ్యమైన ఆహారం అందించాలని కళాశాల ప్రిన్సిపల్ బి.అంజలీదేవికి సూచించారు. మండల సర్వేయర్ రమణ, విఆర్‌ఒ రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
సమస్యలు తెలుసుకుంటున్న అభిషేక్ కుమార్










