ఫొటో : గంభూసియ చేపలను వదులుతున్న ఆరోగ్యసిబ్బంది
కంపసముద్రంలో 'డ్రైడే ఫ్రైడే'
ప్రజాశక్తి-మర్రిపాడు : జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు మండలంలోని కంపసముద్రం గ్రామ సచివాలయం పరిధిలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. నీరు నిల్వ ఉన్న నీటి గుంటలలో గంభూసియ చేపలను వదిలారు. దీని వలన కీటక జనీత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడవచ్చన్నారు. దోమలు లార్వాదశలోనే ఉన్నప్పుడు గంభూషియ చేపలు ఆహారంగా తీసుకుంటాయని తెలిపారు. దానివల్ల లార్వా అభివృద్ధి చెందదన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ కల్పన, ఆరోగ్య మండల విస్తరణాధికారి కొండారెడ్డి, మలేరియా సబ్ యూనిట్ అధికారి నౌషాద్, జావిద్, జగన్, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.










