మొక్కలు నాటుతున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణంలో వివిధ వార్డుల్లో ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛతా కార్యక్రమాలు, శ్రమదానం శనివారం నిర్వహించారు. కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి ఎన్ విజయ బాబు ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిం చారన్నారు. గుణ్ణం కట్ట వద్ద నాగార్జున స్కూల్ విద్యార్థులు పురపాలక సంఘ కార్మికులు సచివాలయ సిబ్బంది సహకారంతో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించబడింది.. ప్రజల భాగస్వామ్యం అంటే ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుంటుందని కమిషనర్ ఎస్ మనోహర్ తెలిపారు.










