ప్రజాశక్తి-కందుకూరు :వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే జి -20 సమావేశాలను పురస్కరించుకొని విరు -20 పేరుతో శనివారం ఢిల్లీలోని సిపిఎం (హరికిషన్ సూర్జిత్ సింగ్ భవన్) కార్యాల యంలో 70కి పైగా వివిధ ప్రజా, కార్మిక, పౌర సంఘాలు మేధావులు పాల్గొని నిర్వహించతలపెట్టిన సెమినార్‌ను శనివారం ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో నిరంకుశత్వంగా అడ్డుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ ఆదివారం కందుకూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం ఉలవపాడు, వలేటివారిపాలెం మండలాల ఇన్‌ఛార్జి జీవీబీ కుమార్ అధ్యక్షత వహించారు. సిపిఎం కందుకూరు పట్టణ కార్యదర్శి ఎస్.ఏ.గౌస్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయన్నారు. ఇటువంటి దుర్మార్గమైన విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. బిజెపి విధానాలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండించాలన్నారు. సిపిఎం కందుకూరు పట్టణ నాయకులు ఎస్.కె. మున్వర్ సుల్తానా, ఎం. పద్మ , దాసరి రామమూర్తి, టి .వెంకట్రావు మెడ బలిమి. ప్రసాద్,డి. యం. రాయుడు, పి.వి రామారావు, జి. శ్రీనివాసులు,నాగేశ్వరరావు ఉన్నారు.










