ప్రజాశక్తి-కందుకూరు : అంబేద్కరిస్టు, సాహిత్య కారుడు, సామాజిక వేత్త, విద్యావంతుడైన నూకతోటి ప్రసాద్ మృతి బహుజన సమాజానికి తీరనిలోటని ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. కందుకూరు ఎంఇఒగా పనిచేస్తున్న ప్రసాద్ గతకోంత కాలంగా అనార్యోంతో బాదపడుతూ కందుకూరు బృదావనంలో మంగళవారం మృతిచెందారు. ఆయన భౌతిక ఖాయానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మతి దళిత బహుజన దక్పథం కలిగి, అంబేద్కర్ భావజాలంతో సమాజ మార్పు కోసం కషి చేస్తున్న వారికి తీవ్ర ఆవేదన మిగులుస్తుంని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. తాను పని చేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి తగిన సూచనలు ఇస్తూ వారి పురోభివద్ధికి తోడ్పడిన గొప్ప ఉపాధ్యాయుడు నూకతోటి ప్రసాద్ అని కొని యాడారు. నూకతోటి ప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించినవారిలో జాషువా సాహిత్య సాంస్కతిక సంస్థ అధ్యక్షుడు ముప్పవరపు కిషోర్, సామాజిక వేత్త బి.వెంకటేశ్వర్లు(బి వి) ధర్మచక్ర ఫౌండేషన్ అధ్యక్షుడు గాండ్లహరిప్రసాద్, న్యాయవాది పోకూరి కోటయ్య, టీచర్ హరిబాబు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.










