Jul 23,2023 21:14

కండ్ల కలకలలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి - మక్కువ : మండలంలోని కండ్ల కళకళ వైరస్‌ను ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల్లో కండ్ల కళ్లకు రావడంతో వారు పాఠశాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అలాగే పెద్దవారికి కూడా ఈ వైరస్‌ రాగడంతో పనులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. ఈ వైరస్‌తో ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ వారం రోజుల పాటు బయటకు వెళ్లలేని స్థితిలో బాధితులు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు కూలీలు ఆవేదన చెందుతున్నారు. మక్కువ, శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పలు గ్రామాల్లో ఈ వైరస్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఈ వైరస్‌ వస్తూ ఉంటుందని, దీనివల్ల స్వల్ప ఇబ్బందులు ఉంటాయని శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్‌ రఘుకుమార్‌ 'ప్రజాశక్తి'కి తెలిపారు. కండ్లు ఎర్రబారడం, నీరు కారడం, పుసులు కట్టడం లక్షణాలు ఉంటాయని అన్నారు. యాంటీ బయోటిక్స్‌ డ్రాప్స్‌ వాడుకున్నట్లయితే సరిపోతుందని, వారం రోజులకు తగ్గకుంటే డాక్టర్లు సంప్రదించాలని ఆయన తెలిపారు.
పూతిక వలస ఆశ్రమ పాఠశాలలో కండ్ల కలకలు
సీతంపేట: మండలంలోని పూతికవలస బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సుమారు 20 మంది బాలికలు కండ్లు కలకలతో బాధ పడుతున్నారు. ఈ పాఠశాలలో సుమారు 480 మంది విద్యార్థినిలు చదువుతున్నారు. కల్లు కాలకలు సీజన్‌ కావడంతో అన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఇప్పటికే కళ్లు కలకలు ఉన్నచోట తెలిసిన వెంటనే వైద్యులు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.