Jun 12,2023 00:48

కందను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు

ప్రజాశక్తి -కొల్లూరు : మండల పరిధిలోని లంక గ్రామాలకు చెందిన రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో కంద సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం కందకు మంచి డిమాండ్‌ ఉంది. గతేడాడి కంద పుట్టి రూ.3 వేల నుంచి రూ.3,500 పలికింది. ప్రస్తుతం రూ.6 వేలు పలుకుతోంది. దీంతో రైతులు ఎక్కువగా కంద సాగుకు మొగ్గు చూపుతున్నారు. కంద సాగుకు ఎకరానికి లక్ష రూపాయల ఖర్చు అవుతుంది. దిగుబడి బాగా వస్తే ఎకరానికి 70 పుట్లు దిగుబడి వస్తుంది. రూ.4 లక్షల మేర ఆదాయం సమకూరుతుంది. ఖర్చుల అన్ని పోను రైతులకు మంచి ఆదాయం వస్తుంది. కంద చెన్నై, బాంబే మార్కెట్లలో మంచి దిమాండ్‌ ఉంది. దీంతో రైతులు కంద సాగు చేసేందు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఎక్కువ విస్త్రీర్ణంలో కంద సాగు చేసే అవకశాం ఉంది.