Jan 13,2023 23:54

కందిపప్పును పరిశీలిస్తున్న జిల్లా పౌర సరఫరాల అధికారి

ప్రజాశక్తి-పాడేరు:అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలల వసతి గృహాలకు, ప్రభుత్వం సరఫరా చేస్తున్న కందిపప్పు నాణ్యతను పరిశీలన చేస్తున్నట్లు అల్లూరి జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్‌.శివప్రసాద్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక గుడివాడ వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో కందిపప్పును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలకు సరఫరా జరుగుతున్న కందిపప్పు ఉడక లేదని, నాణ్యత విషయంలో తేడా ఉందని వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలన చేస్తున్నామన్నారు. కందిపప్పును ఉడికించి కూడా చూసామని అందరి నుంచి బాగానే ఉన్నట్లు నివేదికలు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌సి ఎస్‌సి లిమిటెడ్‌ డివిజనల్‌ మేనేజర్‌ గణేష్‌, వినియోగదారుల సంఘం ప్రతినిధి లకే నాని బాబు, అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.