కంది, ఆముదాలకు నష్టపరిహారం అందించాలి
ప్రజాశక్తి-డోన్
కంది, ఆముదాల పంటలకూ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని నంద్యాల జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏఈ నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని పాత బస్టాండ్‌లోని ముక్తేశ్వర ఆలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏఈ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని నమ్ముకుని వేరుశనగ,పత్తి పంటలలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో దేశానికి ఆదర్శంగా అందజేశారని అన్నారు. కొన్ని పంటలకు నష్టపరిహారం రాలేదని వాటికి పరిహారం ఇవ్వాలని కోరారు. డోన్ నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రానికి ఆదర్శంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారన్నారు. కొండ పేటలో రైల్వే గేటు కర్నూలు గేట్ల మధ్యన అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం హర్షణీయం అన్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పూర్తయితే కొండపేటకు పూర్వవైభవం వస్తుందన్నారు. హిందూ స్మశాన వాటికకు ప్రభుత్వ ఆసుపత్రికి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఎంతో ఉపయోగప డుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ మండల ఉత్తమ రైతులు బ్రహ్మానంద రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










