Oct 30,2022 22:23

ట్రెక్కింగ్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

ప్రజాశక్తి -తగరపువలస : స్థానిక అనీల్‌ నీరుకొండ దంత వైద్య కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ఆదివారం కంబాల కొండపై ట్రెక్కింగ్‌ నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపడంతో పాటు ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహద పడతాయని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎల్‌ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతమున్న ఆధునిక యాంత్రిక జీవన శైలిలో ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శివకుమార్‌ అన్నారు. అనంతరం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ స్వాతి, కళాశాల స్టూడెంట్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నవీన్‌, సెక్రటరీ డాక్టర్‌ మణికంఠ, 25 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.