
ప్రజాశక్తి-పరవాడ
మండలంలోని తానాం పంచాయతీ పరిధిలో మైలాన్ కంపెనీ నిధులు కోటి 15 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.90 లక్షలతో చేపడుతున్న ఇంటింటి కుళాయిలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనం కోసం మైలన్ కంపెనీ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జల్ జీవన్ మిషన్ పథకాన్ని రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జెడ్పీటిసి సభ్యులు పైల సన్యాసిరాజు, వైసిపి నాయకులు పైల శ్రీనివాసరావు, చుక్క రామునాయుడు, కోన రామరావు, వెన్నెల సన్యాసిరావు, సర్పంచ్ కన్నూరు దేవి వెంకట రమణ, ఎంపీటీసీ రొంగలి సునీత, ఎంపీడీఓ హేమసుందరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ విజయలక్ష్మి, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.