May 19,2023 18:36

సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తాం - సిపిఎం
ప్రజాశక్తి - నంద్యాల

      పుచ్చలపల్లి సుందరయ్య  38 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సి పి ఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులు , రాజశేఖర్ , నాగరాజు , పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహ, సిపిఎం పట్టణ సెక్రటేరియట్ సభ్యులు కే ఎండి గౌస్, దర్శనం లక్ష్మణ్ పట్టణ కమిటీ నాయకులు వీర సేన లక్ష్మణ్ శివ తదితర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన దేశ కమ్యూనిస్టు ఉద్యమ ప్రసిద్ధి నేతలో కామ్రేడ్ పుచులపల్లి సుందరయ్య ఒకరు ఉద్యమానికి ఆయన అందించిన అనేకానేక సేవలలో రెండు ప్రధానమైనవి దీర్ఘకాలం నిలిచి వుండేవి అందులో ఒకటి పార్టీ నిర్మాణంలో అయన నిర్వహించిన పాత్ర గ్రామసీమలలో వ్యవసాయక సమస్య పట్ట ఆయన రూపొందించిన మార్టిస్ట్ దృక్పథం అదేవిధంగానే కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర గురించి ఈ వ్యాసంలో నేను దృష్టి కేంద్రీకిస్తాను తాను 1930లో నేను కమ్యూనిస్టుడినని సుందరయ్య స్వయంగా చెప్పుకున్నారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం వినియోగించబడ్డ అమీర్ హైదరాబాద్ ఖాన్ అరెస్టు తర్వాత ఆయన నిర్మాణ దక్షత బాగా ప్రసిద్ధి అయినదని అన్నారు. యువ సుందరయ్య పార్టీ ఆర్గనైజర్ గా 1934లో బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 22 సంవత్సరాలు మాత్రమే ఆవిభక్తి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కేంద్ర కమిటీ లో ఆయన సభ్యుడిగా అయ్యారు. తరువాత ఆయన చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ప్రజా సమస్యలపై పార్లమెంటులో మాట్లాడే సందర్భంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆయనకు ఎదురు చెప్పే పరిస్థితి లేదన్నారు. సంస్కారానికి సాంప్రదాయానికి పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శమైన వ్యక్తి ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైన వారికిచ్చే మర్యాద వారికి ఇచ్చేవారు పార్లమెంటుకు ఆ కాలంలోనే సైకిల్ పైన పార్లమెంటుకు వచ్చేవారని పుచ్చలపల్లి సుందరయ్య  మీటింగ్కు లక్షల మంది ప్రజలు కదిలి వచ్చేవారని పూర్తిగా పార్టీకే అంకితమై పుచ్చలపల్లి సుందరయ్య పార్టీని నడిపించారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నేటి ప్రజలు, నాయకులు నడవాలని వారి ఆశయాలను సాధించాలని కోరుతున్నామని తెలిపారు.