తాడేపల్లి: ప్రతివిద్యార్థిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉం టుందని, దాన్ని వెలికితీయడమే తల్లి దండ్రులు, ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అర వింద హైస్కూల్ ప్రిన్సిపల్ బి.ఇంద్రాణి అన్నారు. ఆది వారం అమరావతి ఐకాన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సుల భతరంగా ఇంగ్లీషు నేర్చుకుందాం, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై మాస్టర్ పాగోలు రాజు (ఎంఎ పిహెచ్‌డి) విద్యా ర్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చిన ఇంద్రాణి మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరి సొత్తు కాదని, దానిన ఒడిసి పట్టుకుని విద్యార్థినీ విద్యా ర్థులు పైకి రావాలని, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉంటున్న విద్యార్థులకు మెరిట్‌పై శిక్షణ ఇచ్చేందుకు మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాస్టర్ పాగోలు రాజు మాట్లా డుతూ మాతృభాషలో రాణిస్తేనే ఇంగ్లీషులోనూ రాణి స్తారని చెప్పారు. సులభతరంగా ఇంగ్లీషు నేర్చుకుందాం, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ఐదు గంటల పాటు ఆయన నడిపిన క్లాసు విద్యార్థులను ఆలోచింప జేసింది. అమరావతి ఐకాన్ ఫంక్షన్ హాల్ విద్యార్థులతో నిండిపోయింది. బాలోత్సవం కోశాధికారి గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు అవసరమైనా అమ్మ భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బాలోత్స వం నిర్వాహకులు యడ్ల బాలకృష్ణ, ఈదర రాజశేఖర్, రియాజ్ బాష, సురేంద్ర, నాగరాజు, వై.సుబ్బారావు, షితిజ, పిఇటి రమేష్, పిన్నమనేని విజయ పాల్గొన్నారు.










