కావాల్సిన పదార్థాలు :
కోకో పౌడర్ - అరకప్పు, కోడిగుడ్డు - ఒకటి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - టీస్పూన్, పిండి - ఒకటిన్నర కప్పు, బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీస్పూన్, బేకింగ్ సోడా - ఒకటిన్నర టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, వెన్న - మూడు టేబుల్‌స్పూన్లు, డార్క్‌బ్రౌన్ షుగర్ - ముప్పావు కప్పు, పాలు - పావు కప్పు, యాపిల్ సాస్ - పావుకప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు, మఫిన్ కప్పులు - 12.
తయారుచేసే విధానం :
ముందుగా ఒక పాత్రలో పిండి తీసుకొని కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. మరొక పాత్రలో క్రీమ్, వెన్న, పంచదార తీసుకుని అన్ని పదార్థాలు కలిసేలా కలియబెట్టాలి. అందులోనే కోడిగుడ్డు కొట్టి ఆ మిశ్రమాన్ని, వెనీ లాను వేసి కలపాలి. మిశ్రమాలు బాగా కలిసేందుకు పాలు పోయా లి. ఈ మిశ్రమాన్ని మఫిన్ కప్పులలో నింపాలి. ఓవెన్‌లో 20 నిమిషాల పాటు ఉంచాలి. ఓవెన్‌లో నుంచి తీశాక అర గంట పాటు చల్లా ర్చాలి. తర్వాత సర్వ్ చేసు కోవాలి.