Oct 05,2023 00:35

మాచర్ల: ఆల్‌ ఇండియా గ్రామీణ బ్యాంక్‌ యూనియన్‌ డాక్‌ సేవక్‌ యూనియన్‌,నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ పిలుపు మేరకు ఆ శాఖ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె చేశారు. స్థానిక ఉపతపాల శాఖ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాచర్ల సబ్‌ డివిజన్‌ జిడిఎస్‌ ప్రెసిడెంట్‌ రామారావు, స్పెషల్‌ చెన్నకేశవ శర్మలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారి కోసం కమలేష్‌ కమిటీ సిఫార్సులను అంద జేసి చాలాకాలమైందని అన్నారు. ఏడేళ్లయినా ఆ సిఫారసులు అమలు చేయకపోవడం వల్ల, ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని, వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో జి ఎల్‌ ఎస్‌ శర్మ, భాస్కర్‌, మహేష్‌ పాల్గొన్నారు.