Apr 30,2021 07:20

   స్వీయ ఆర్థిక యాజమాన్య విధానాన్ని అమలు చేసుకునేలా విద్యుత్‌ సంస్థలను సిద్ధం చేయాలని, అవి సొరత ఆర్థిక స్థోమతను పెరచుకునేలా చూసేరదుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీని నియమించడం వెనుక కారణాలేమిటా అన్నది తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యుత్‌ రంగంలో తనవైన 'సంస్కరణలు' తీసుకురావడానికి అవసరమైన భూమికను ఏర్పాటు చేయడానికేనన్న విశ్లేషకుల మాటను కొట్టి పారేయలేం. ప్రపంచ బ్యాంకు ఆదేశిత విద్యుత్‌ సంస్కరణలకు ప్రాతిపదికలు హితేన్‌ భయ్యా కమిటీ సిఫార్సుల నుండే వచ్చిన విషయం అందరికీ తెలిసిందే! విద్యుత్‌ బోర్డు మూడు ముక్కలు కావడంతో మొదలై 2000 సంవత్సరంలో గూబ గురు మనిపించేలా చార్జీలను పెంచడానికి అవసరమైన పునాది ఆ కమిటీ నివేదికలోనే పడింది. బుధవారంనాడు ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ కృష్ణమోహన్‌రెడ్డి కమిటీ అటువంటి ప్రయోజనాల కోసమేనా అన్నది ఇప్పుడు విద్యుత్‌ రంగ విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న.
   విద్యుత్‌ సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధిరచేరదుకు అరటూనే కమిటీకి ఇచ్చిన మార్గదర్శకాల్లో మానవ వనరులపై ప్రధానంగా దృష్టి సారిరచాలని ప్రభుత్వం పేర్కొనడం పలు సందేహాలకు తావిస్తోంది. విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లించే జీత భత్యాలపైనా కోతలు పడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు జెఎసి గా ఎర్పడి తమ సమస్యల పరిష్కారంతోపాటు విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా 2020 ద్వితీయార్ధంలో దశలవారీగా ఆందోళనలు చేశారు. చర్చల పేరిట కాలయాపన చేసిన సర్కారు జెఎసి నాయకులను పోలీసులచే అరెస్టు చేయించింది. తరువాత ఒప్పందం కుదుర్చుకున్నా అందులోని అనేక అంశాలు ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ రెండవ దశ బాధల్లో కార్మికులు, ఉద్యోగులూ కొట్టుమిట్టాడుతున్న సమయంలో అధ్యయన కమిటీ సిఫార్సుల సాకుతో ప్రభుత్వం శ్రామికులపై వేటుకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంది.
   ప్రస్తుతర రాష్ట్రంలో డిస్కామ్‌లు రూ.30 వేల కోట్ల నష్టాల్లో ఉండగా, రూ. 80 వేల కోట్ల వరకు రుణ బకాయిలున్నాయంటూ విద్యుత్‌ సంస్థలు తమ ఆదాయాన్ని పెరచుకునేరదుకు, ఖర్చులు తగ్గిరచుకునేరదుకు ప్రయత్నించాలని సర్కారు సూచించిరది. ప్రభుత్వం వద్ద పరిమిత వనరులే ఉన్నందున అన్ని విధాలా అర్హత కలిగినవాటికే ఆర్థిక సాయం చేయగలదని ఉత్వర్వులో పేర్కొనడం వెనుక వివిధ తరగతులకు ఇప్పుడిస్తున్న విద్యుత్‌ సబ్సిడీలకు భవిష్యత్తులో కోత పడవచ్చునన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. జీవో 1126ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకంతో ఆర్థిక శాఖ విడుదల చేయడంలోనే దాని ప్రత్యేకత వ్యక్తమవుతోంది. విద్యుత్‌ సంస్థలపై మాత్రమే అధ్యయనం అయితే ఇంధన శాఖ విడుదల చేసేది. అలాగే కేవలం ఆర్థికపరమైన అంశాలకే అయితే ఆ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జీవో జారీ చేసేవారు. కమిటీ సిఫార్సుల పర్యవసానాలు బహుముఖంగా ఉంటాయనడానికి జీవో జారీలో ప్రత్యేకత ఓ నిదర్శనం.
   కొన్ని సంక్షేమ పథకాలకు అధిక కేటాయింపుల్లో తప్ప మౌలిక ఆర్థిక విధానాల విషయంలో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపిల మధ్య తేడా లేదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి మోకరిల్లడంలో, కేంద్రం లోని బిజెపి సర్కారుతో దోబూచులాడడంలోనూ జగన్‌ మోహన్‌ రెడ్డి, చంద్రబాబు పోటాపోటీనే! దేశవ్యాప్త రైతు ఉద్యమ డిమాండ్లలో మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దుతోపాటు విద్యుత్‌ చట్ట సవరణల ఉపసంహరణ కూడా ఒకటి. నాలుగు నెలలకు పైగా ఉద్యమం సాగుతున్నా మొండిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు విద్యుత్‌ చట్ట సవరణలపై గడచిన ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రాలపై వివిధ ఆంక్షలు విధిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు బిగిస్తోన్న విషయం తెలిసిందే. నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలులో విద్యుత్‌ రంగ సంస్కరణలు కీలకం. ఆ విధానాలను అనుసరించే జగనన్న ప్రభుత్వం తనదైన శైలిలో 'సంస్కరణలు' అమలు చేయడానికి అధ్యయన కమిటీ ఒక సాధనంలా అనిపిస్తోంది. విద్యుత్‌ వినియోగదార్లయిన రాష్ట్ర ప్రజలు, విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు అప్రమత్తంగా ఉండాలి.