Mar 14,2023 17:43

షెడ్లను పరిశీలిస్తున్న చైర్మన్‌, సెక్రటరీ తదితరులు

కమీషన్‌ ఏజెంట్ల విడిదికి తాత్కాలిక షెడ్లు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      నంద్యాల టెక్కె వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మిర్చి యార్డు ప్రారంభించినందున కమీషన్‌ ఏజెంట్ల విడిది కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు. మార్కెట్‌ యార్డ్‌ సెక్రటరీ కల్పన, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సుబ్బారెడ్డిలతో కలిసి చైర్మన్‌ మార్కెట్‌ యార్డులో షెడ్ల నిర్మాణానికి మంగళవారం పరిశీలించారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ మిర్చి క్రయ విక్రయాలు బాగా జరుగుతున్నాయని, క్వింటా ధర రూ.2,300 నుండి రూ.2500 వరకు పోతుందని తెలిపారు. గుంటూరు మార్కెట్‌ కంటే ఇక్కడే ధర బాగుందని, క్రయ విక్రయాలు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ సిబ్బంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.