Feb 27,2023 23:00

ప్రజాశక్తి-భవానీపురం: స్థానిక భవానీపురంలో గల ఎన్టీఆర్‌ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు వివిధ కులాలకు చెందిన కళ్యాణ మండపాల నిర్మాణానికి కోటి 73 లక్షల 8 వేల రూపాయలు ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తూ అయా నిధుల పత్రాలను అయా కుల సంఘ ప్రతినిధులకు సోమవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెలంపల్లి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గంలో వివిధ కులాల వారి వారి కళ్యాణ మండపాల నిర్మాణానికి ఎమ్మెల్యే నేడు విడుదల చేయడం జరిగిందని, ఆ పత్రాలను ఈ రోజు అందించినట్లు చెప్పారు. ఆయా కుల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ వెలంపల్లి ఇచ్చిన మాట తప్పకుండ మా కుల సంఘాల కల్యాణ మండపాల నిర్మాణానికి తన ఎమ్మెల్యే నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు బుల్లా విజరు కుమార్‌, శీరంశెట్టి పూర్ణచంద్రరావు, మరుపిళ్ల రాజేష్‌, ఎం.డి ఇర్ఫాన్‌, మైలవరపు దుర్గారావు, ఆయా కుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.