Aug 01,2023 21:10

క్లస్టర్ల ఏర్పాటు పూర్తి చేయాలి : జెసి

రాయచోటి : జిల్లాలో సంక్షేమ శాఖలు త్వరితగతిన క్లస్టర్లు ఏర్పాటు పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సంక్షేమ శాఖల అధికారులతో క్లస్టర్‌ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రభుత్వ జిఒ ఎంఎస్‌ నెంబర్‌ 37 ప్రకారం సోషల్‌ వెల్ఫేర్‌, బిసి వెల్ఫేర్‌, ఎస్ట్‌ వెల్ఫేర్‌ తదితర అన్ని సంక్షేమ శాఖలు పరిపాలనా సౌలభ్యం కోసం క్లస్టర్‌ ఏర్పాట్లు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖల సహాయ సంక్షేమ అధికారులతో ఏర్పాటు చేసిన వర్క్‌ షాప్‌ నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వివిధ అంశాలపై తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డి.జాకీర్‌ హుస్సేన్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్‌ సలాం, జిల్లాలోని ఎస్‌సి, బీసీ సంక్షేమశాఖల సహాయ అధికారులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌