ప్రజాశక్తి - సీతంపేట : స్థానిక గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం క్లస్టర్ లెవెల్లో గిరిజన క్రీడలను డిడి జి.మంగవేణి ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్రీడలను నిరసిస్తున్నామని తెలిపారు. ముందుగా ఐటిడిఎ పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలో క్రీడలు నిర్వహించి వాటిలో ఎంపికైన వారిని క్లస్టర్ లెవెల్లో క్రీడలు నిర్వహించామని తెలిపారు. ఈనెల 20న గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడాకారులకు ఎంపికలు చేస్తామన్నారు. ఈ క్లస్టర్ లెవెల్‌లో 25 ఆశ్రమ గురుకుల పాఠశాల నుంచి బాల బాలికలు పాల్గొన్నారు. వాలీబాల్ ఆర్చరీ, జావలింగ్ త్రో తదితర క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, ఐటిడిఎ స్పోర్ట్స్ ఇంచార్జ్ ఎన్.జాకబ్ దయానంద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.చందర్రావు, పీడీలు వెంకట్రావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు