ప్రజాశక్తి - వినుకొండ : వినుకొండ అటవీ శాఖ కార్యాలయంలో సిబి సిఐడి అధికారులు గురువారం విచారణ చేపట్టారు. సిబిసిఐడి సబ్ ఇన్‌స్పెక్టర్ అఖిల, సిబ్బంది రికార్డులు పరిశీలించారు. 2020 జులై 23న నమోదసన కేసుపై విచారణ చేపట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ స్టేట్మెంట్‌ను రికార్డు చేశామని అఖిల చెప్పారు. అప్పటి కేసు తాలుకు రికార్డును పరిశీలించామన్నారు. రేంజ్ ఆఫీసర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ 2020లో కడప జిల్లా మైదుకూరు మండలం ఎర్రబెల్లికి చెందిన ఆగిపోయిన బ్రహ్మయ్య అనే వ్యక్తి నరసరావుపేట- చిలకలూరిపేట మధ్య ఒక పాత ఇంటి నారావేపి కలప గంతేలు దూలాలు, మొగరాలు కొనుగోలు చేసుకుని లారీలో నరసరావుపేట వెళ్లగా ఫారెస్ట్ అధికారులు సిబ్బంది గుర్తించి కేసు నమోదు చేశారని చెప్పారు. కలప అక్రమ రవాణా కింద 1.60 లక్షలు జరిమానా విధించా దాన్ని చెల్లించి కలపను చెన్నరులో అమ్ముకునేందుకు వెళ్లాడని, అక్కడ ఎర్రచందనమని విక్రయించే ప్రయత్నం చేయగా ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిబిసిఐడీకి ఆదేశించినట్లు చెప్పారు. గతంలో నరసరావుపేటలో ఫారెస్ట్ అధికారులు తీసిన ఫొటోలు కేసు వివరాలు పరిశీలించి సమగ్ర వివరాలు సేకరించి విచారించినట్లు తెలిపారు.










