Mar 21,2023 23:48

జ్యోతి ప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభిస్తున్న దాడి వీరభద్రరావు

ప్రజాశక్తి-అనకాపల్లి
కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తెలిపారు. స్థానిక వివి రమణ రైతు భారతిలో సోమవారం రాత్రి జ్యోతి సరళ స్మారక కళాపరిషత్‌ వారిచే నిర్వహించబడుతున్న తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 ఎంహెచ్‌ స్కూల్‌ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో డైమండ్‌ హిట్స్‌ సంస్థ ప్రోత్సాహంతో ఈ పోటీలు నిర్వహించడం హర్షనీయమన్నారు. కళా పరిషత్‌ కార్యదర్శి పి సి హెచ్‌ నాయుడు కలలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో తన భార్య సరళ పేరుతో కళాపరిషత్తు ఏర్పాటు చేసి పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కళలకు అనకాపల్లి పుట్టినిల్లు వంటిదని, నాటిక నాటకాలను ఇక్కడి ప్రజలు ఎంతో ఆదరిస్తారని చెప్పారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఆహ్వాన నాటిక పోటీలను ప్రోత్సహించాలన్నారు. అనంతరం విజయవాడ వారిచే స్వర్ణకమలాలు నాటిక, 9 గంటలకు రాథోడ్‌ థియేటర్స్‌ చిలకలూరి వారి పేట వారిచే నాన్నా నేనొచ్చేసా నాటికలు ప్రదర్శించారు. కార్యక్రమంలో గవర కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శిల్పరశెట్టి బాబి, వ్యవసాయదారుల సంఘం కార్యదర్శి విల్లూరి రాము, నిర్వాహకులు బొడ్డేడ జగత్‌ రావు, కె యం నాయుడు, భీశెట్టి కృష్ణ అప్పారావు, న్యాయ నిర్నేతలు ధవళేశ్వర రావు, శేషగిరిరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.