Oct 29,2023 23:12

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనగా టిడిపి ఆధ్వర్యాన ఆదివారం కళ్లకు గంతలు కట్టుకుని పలుచోట్ల నిరసన తెలిపారు. కాకినాడ మాజీ మేయర్‌, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నిజం గెలవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, చల్లా పార్వతి, పాలిక సత్య, నక్కా జ్యోతి, రేలంగి లక్ష్మి, కనకం, దుర్గ, సత్యవతి, నిర్మల, రమణ, భ్రమరాంబ పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ టిడిపి నియోజకవర్గం పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు వలసపాకలలో పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్‌, బోళ్ల కష్ణమోహన్‌, క్లస్టర్‌ ఇన్చార్జిలు తాతపూడి రామకష్ణ, సరిదే నాగర్నాథ్‌ మిరపల ప్రకాష్‌, మట్టా ప్రకాష్‌ గౌడ్‌, కాళ్ళ శ్రీను తదితరు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ మఠం సెంటర్‌లో పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నిజం గెలవాలని నినాదాలు చేశారు. మండలంలోని హుస్సేన్‌పురం కెనాల్‌ రోడ్డుపై చల్లా బుజ్జి ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌, కంటే బాబు, గుండు వీర్రాజు, బలుసు వాసు, తాతపూడి కృష్ణబాబు, బి.త్రిమూర్తులు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప మెహర్‌ కాంప్లెక్స్‌ వినాయకుని ఆలయంలో చంద్రబాబు కోసం పూజలు చేశారు. ప్రత్తిపాడు రాష్ట్రంలో టిడిపి కార్యకర్తల మనోనిగ్రహం దెబ్బతీయడం ఎవరి వల్లా కాదని టిడిపి రాష్ట్ర నాయకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు అన్నారు. ప్రత్తిపాడులో ఆదివారం నిర్వహించిన టిడిపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు టిడిపి కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు అన్నారు. అతి త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు శాంతి భద్రతలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బద్ది రామారావు, పర్వత సురేష్‌, సూతి బూరయ్య, బొద్దిరెడ్డి గోపి, బస ప్రసాద్‌, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.