
ప్రజాశక్తి - నందిగామ : న్యాయం గెలవాలని కోరుతూ నందిగామ నియోజవర్గం జయంతి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నందిగామ గాంధీ సెంటర్లో నిరసన తెలియజేశారు. న్యాయం గెలవాలని, చంద్రబాబు విడుదల కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జయంతి గ్రామ టిడిపి నాయకులు గువ్వల సత్యనారాయణ పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. రెడ్డిగూడెం : టిడిపి మండల అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిజం గెలవాలంటూ కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసన వ్యక్తం చేశారు. గంపలగూడెం : వైసిపి ప్రభుత్వానికి మూసుకుపోయిన కళ్ళు తెరిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఐదు నిమిషాలు పాటు కళ్ళకు గంతలు కట్టుకొని పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ గాంధీ సెంటర్లో జరిగిన కార్యక్రమం సందర్భంగా, మండల పార్టీ అధ్యక్షుడు రేగళ్ల వీరారెడ్డి మాట్లాడారు. నందిగామ : రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నందిగామ నియోజకవర్గ అధ్యక్షురాలు కల్పన నందిరాజు ఆధ్వర్యంలో 'కళ్ళు తెరిపిద్దాం' అనే కార్యక్రమాన్ని నారా లోకేష్ పిలుపుతో నందిగామ ఇన్చార్జ్ తంగిరాల సౌమ్య పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య సూచనతో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం రాత్రి కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. జగ్గయ్యపేట: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం రాత్రి న్యాయం గెలవాలి అనే కార్యక్రమం టిడిపి జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో న్యాయం గెలవాలి అని గట్టి నినాదాలు చేస్తూ తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. భవానీపురం : జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు 42వ డివిజన్ శివాలయం సెంటర్లో మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య అధ్వర్యంలో కళ్ళ కు గంతలు కట్టుకుని ఈ ప్రజా సౌమ్య వ్యవస్థలో న్యాయం కావాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సీతా చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు నెలకుర్తి వెంకట రావు, కుమారి, బొర్రా భాను, తదితరులు పాల్గొన్నారు. వన్‌టౌన్ : ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న ఫ్లైట్‌లో కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. ఆదివారం విజయనగరంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి హాజరై వైజాగ్ నుండి హైదరాబాద్ ఫ్లైట్‌లో వెళ్తూ ఈ నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం : కొండపల్లి మున్సిపాలిటీలో 45వ రోజు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివద్ధి ప్రదాత, విజన్ 2020 సష్టికర్తనీ, రాజకీయ కక్షతో అరెస్ట్ చేసిన జగన్‌రెడ్డి ఆయన దుష్ట పార్టీకి భవిష్యత్తులో పాతాళంలోకి ప్రజలే పంపిస్తారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ పార్టీ అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావు, కౌన్సిలర్ కరిమికొండ శ్రీ లక్ష్మీ, మండల ప్రధాన కార్యదర్శి సాకిరి వెంకట నరసయ్య, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.