
ప్రజాశక్తి- బొబ్బిలి : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కోటలో టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన, కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని ఆదివారం రాత్రి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బేబినాయన మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎం.తిరుపతిరావు ఉన్నారు.
వేపాడ : మండంలోని బానాదిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ పిలుపు మేరకు టిడిసి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో కళ్లు తెరిపిద్దాం కార్యక్రమాన్ని కళ్లకు గంతులు కట్టుకుని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బానాది ఎంపిటిసి గొంప తులసి, నాయకులు కండిపల్లి రమేష్, గొంప రామకృష్ణ, కండిపల్లి ఎర్రినాయుడు, కండిపల్లి అప్పలనాయుడు, కండిపల్లి రామారావు, గుమ్మడి రాంబాబు, కండిపల్లి ముత్యాల నాయుడు, కొట్యాడ వెంకటరావు, చాలుమూరి శ్రీరామ్, గుమ్మడి సత్యం, గొంప కోటేశ్వరరావు, గొంప శ్రీరామ్, కండిపల్లి ఈశ్వరరావు, కండిపల్లి రామారావు, సోమిరెడ్డి సతీష్, గుమ్మడి రాము తదితరులు పాల్గొన్నారు.
బాడంగి: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా ఆధ్వర్యంలో నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఎరుకుల పాకలో గజరాయని వలస ఎంపిటిసి, రాష్ట్ర ఎస్‌టి సెల్ జనరల్ సెక్రటరీ పాలవలస గౌరు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, వైస్ ఎంపిపి భాస్కర్ రావు తుదితరుల పాల్గొన్నారు.
విజయనగరం: స్థానిక టిడిపి కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు
శృంగవరపు కోట: రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దామనే నినాదంతో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆయన నివాసం వద్ద కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాయవరపు చంద్రశేఖర్, జుత్తాడ రామసత్యం, మాదిబోయిన మంగరాజు, ఆడారి ఉమామహేశ్వరరావు, గనివాడ సన్యాసినాయుడు, కోరుకొండ శ్రీనివాస్ రావు, మండా త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.