విద్యార్థులను పరీక్షించి మందులను పంపిణీ చేస్తున్న డాక్టర్ సోమశేఖర్
ప్రజాశక్తి - ఆదోని
శరవేగంగా వ్యాపిస్తున్న కళ్లకలక వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోమియోపతి డాక్టర్ సోమశేఖర్ సూచించారు. శనివారం పట్టణంలోని బిఎన్ టాకీస్ సమీపంలో స్నేహా క్లినిక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు కళ్ల జోడుతోపాటు మాత్రలు తీసుకోవాలన్నారు. రుద్దడం, గోకడం లాంటివి చేయకూడదన్నారు. పాఠశాల ఇన్‌ఛార్జీ ప్రధానోపాధ్యాయులు రాధ, ఉపాధ్యాయులు స్నేహా పాల్గొన్నారు.










