Sep 28,2023 00:15

కల్లాం భూమిని కబ్జా నుండి కాపాడండి..

కల్లాం భూమిని కబ్జా నుండి కాపాడండి..
ప్రజాశక్తి -వెదురుకుప్పం: కల్లాం భూమిని కబ్జా కాకుండా కాపాడాలని గ్రామస్తులు అందరూ కలిసి వినూత్నంగా బ్యానర్‌ తో ప్రదర్శన నిర్వహించారు. బుధవారం ఆ గ్రామస్తులుమాట్లాడుతూ వెదురుకుప్పం మండలం, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జగనన్నకు చెబుదాం కార్యక్ర మాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు హాజరై సమస్యలు ఉన్నా రైతుల దగ్గర నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ నేపథ్యం లో జక్కదొన గ్రామానికి చెందిన గ్రామస్తులు సర్వే నెంబరు 320/2 కళ్లాం భూమి ఉంది. కొందరు స్థానిక నాయకులు ఈ భూమిని ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్నారని ఆ కబ్జాదారుల నుంచి ఆ భూమిని కాపాడాలని గ్రామస్తులు అందరూ కలిసి బ్యానర్‌ తో నిరసన తెలిపారు. స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, తహశీల్దారుకి సంబంధిత ఆదేశాలు ఇచ్చారు.