May 03,2023 23:43

కళ్ల అద్దాలు అందజేస్త్న్ను సాల్మన్‌ రాజ్‌

ప్రజాశక్తి-భట్టిప్రోలు : చుండూరు మండలం అలపాడు గ్రామంలో గ్రేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 60 మందికి బుధవారం కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ అధినేత కైతేపల్లి సాల్మన్‌రాజ్‌ మాట్లాడుతూ గత నెలలో ఎల్‌వి ప్రసాద్‌ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో గ్రేస్‌ ఫౌండేషన్‌ సహకారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో 60 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించినట్లు తెలిపారు. వారికి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు నిర్వహాఇంచినట్లు తెలిపారు. కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి అద్దాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పౌండేషన్‌ సభ్యులు యాన్నం సురేష్‌, యల్లమాటి దాసు,క్రాప నాని తదితరులు పాల్గొన్నారు.