
ప్రజాశక్తి -మునగపాక రూరల్
విభిన్న కథా చిత్రాలకు ప్రేక్షకులలో అపూర్వ ఆదరణ నేటికీ లభిస్తుందని ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు తన క్యాంప్ కార్యాలయంలో ఈనెల 21వ తేదీన విడుదల కానున్న కలియుగ భగవాన్ సినిమా పోస్టరును గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ టీవీలు, సెల్ ఫోన్ మోజుల్లో పడి సినిమా పరిశ్రమకు ఆదరణ కరువు అవుతున్న రోజుల్లో సంప్రదాయ విలువలకు అద్దం పట్టే చిత్రాలకు మంచి ఆదరణ లభించడం గొప్ప శుభ పరిణామని చెప్పారు. గాయకుడిగా, గేయ రచయితగా, లఘు చిత్రాలతో తన ప్రస్థానం ప్రారంభించి వెండి తెర దర్శకుడుగా తన ప్రజ్ఞ పాటవాలు చూపిన గ్రామస్తుడు, కలియుగ భగవాన్ చిత్ర దర్శకుడు కోరుకొండ గోపికృష్ణను ప్రసాదు అభినందించారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన వెలవలపల్లి కోటేశ్వర శర్మ (చిత్రంలో ప్రత్యేక పాత్రధారి), విల్లూరి జగ్గ అప్పారావు (మాటల రచయిత), చిత్ర నిర్మాత మేడిది ఈశ్వరరావు, వెలగ సురేష్ కుమార్, దాడి పోలీస్, వేగి కృష్ణ, ఆడారి గోపి, రాజాన బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.