Nov 01,2022 23:05

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (కష్ణా)
జిల్లాను అభివద్ధి, సంక్షేమపథంలో నడిపించేందుకు అందరం కలిసి కట్టుగా కషి చేద్దామని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మచిలీపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగుతల్లి విగ్రహానికి అధికారులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలో జరుగుతున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ బాషా మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా కింద గత మూడేళ్లలో రూ.485 కోట్లను రైతులకు అందించినట్లు తెలిపారు. ఈఏడాది జిల్లాలో 4.40 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్న పంటల వివరాలను నూరు శాతం ఈ క్రాప్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 18 వేల ఎకరాలను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. 100 గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే ఈనెలాఖరుకు పూర్తవుతుందన్నారు. మిలిగిన గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతుందని తెలిపారు. 94 వేల మందికి పక్కా గహాలు మంజూరు చేయడంతోపాటు ఇప్పటి వరకు 6 వేల గహాలను పూర్తి చేసినట్లు తెలిపారు. 20 వేల గృహాల నిర్మాణాన్ని బేస్‌మెంట్‌ పైస్థాయికి పూర్తి చేసినట్లు తెలిపారు. 13,712 మందికి టిడ్కో గహాలు మంజూరు చేశామని, గుడివాడలో 7 వేల టిడ్కో గహాలను వచ్చే నెలలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి లబ్ధిదారులకు అందిస్తారని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టామని, రాష్ట్రవ్యాప్తంగా త్వరలో దీనిని అమలు చేయనున్నారని కలెక్టర్‌ తెలిపారు. ఉపాధిహామీ చట్టం కింద ఈ ఏడాది జిల్లాలో 50 లక్షల పనిదినాలు కల్పించినట్లు, నూరుశాతం వేతనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఫించన్‌ కానుక కింద ప్రతి నెలా ఒకటవ తేదీనే సామాజిక ఫించన్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మంగళవారం ఉదయం 11 గంటలకే జిల్లాలో 70 శాతం ఫించన్‌ పంపిణీ చేశామని, సాయంత్రానికి అందరికీ పంపిణీ పూర్తవుతుందని పేర్కొన్నారు. గ్రామదర్శిని కింద ప్రత్యేకాధికారులు గ్రామాల్లో తనిఖీలు చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కషి చేస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నంలో రూ.550 కోట్లతో చేపట్టిన మెడికల్‌ కళాశాల భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెడికల్‌ కళాశాలకు అనుబందంగా జిల్లా ఆస్పత్రిని రూ.5 కోట్లతో అభివద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బందరు పోర్టుకు కోర్టు సమస్యలు తొలగాయని, రూ.3,670 కోట్లతో ఈ పోర్టు ప్రాజెక్టు పనులను త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. నాటక అకాడమీ డైరెక్టర్‌ నక్కా గాంధీ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మల్కాపురం కనకారావు, బొందిలీ కార్పొరేషన్‌ సత్యనారాయణ సింగ్‌, లిడ్‌ క్యాప్‌ డైరెక్టర్‌ కోనేరు సత్యప్రియ, ముస్లీం సంచార జాతుల డైరెక్టర్‌ ఎస్‌కె.సయ్యద్‌, రెడ్డిక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కె.రాంబాబు తదితరులు మాట్లాడారు. తొలుత వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈకార్యక్రమంలోఎఎస్‌పి రామాంజనేయులు, డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్‌ పి.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.