Oct 19,2022 22:58

రోడ్లను శుభ్రం చేస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని శొంఠ్యాం దరి నడింపల్లి సత్యనారాయణరాజు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఎస్‌ఆర్‌ఐటి) కళాశాలలో క్లీన్‌ ఇండియా2.0లో భాగంగా బుధవారం స్వచ్ఛభారత్‌ నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కాలేజీ లోపల, పరిసరాల్లో ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా కాలేజీ డైరెక్టర్‌ మురుగుదాస్‌ మాట్లాడుతూ, విద్యార్ధి దశ నుంచే సామాజిక స్పృహ, సేవాభావం అలవరచుకోవాలని, ప్రతి విద్యార్థి బాధ్యతగా స్వచ్ఛభారత్‌, క్లీన్‌ ఇండియాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ హరికృష్ణ, డీన్‌ డాక్టర్‌ శర్మ పాల్గొన్నారు.
ములగాడ : క్లీన్‌ ఇండియా క్యాంపెయిన్‌ 2.0లో భాగంగా మల్కాపురం సెయింట్‌ ఆన్స్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థినులు కలాశాల ఆవరణలోని ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని దాదాపు 175కిలోలు సేకరించి, జివిఎంసి పారిశుధ్య సిబ్బందికి అందజేశారు. ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్‌.భాగ్యలక్ష్మి, ఇతర ప్రోగ్రాం అధికారులు వై. అనసూయదేవి, వి.అంజలీదేవి, ఎ.సంధ్యారాణి, ఎన్‌.నదియ పర్యవేక్షించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ సిస్టర్‌ ప్రేమ కుమారి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ జానీస్‌ విద్యార్థులను అభినందించారు.